ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 8:48 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

కాపర్ వైర్ దొంగల ముఠా అరెస్ట్

మంచిర్యాల, అర్జున్ సమాచారం, (సెప్టెంబర్ 03):

రామగుండం పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్, సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్-జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
​కేసు వివరాలు:
​సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్పూర్ గేట్ ఏరియాలో ఉన్న NSDCL సబ్-స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్స్ రిపేర్ షాప్‌లో ఈ నెల 27న రాత్రి సమయంలో సుమారు 170 కిలోల కాపర్ వైర్ చోరీకి గురైంది. షాప్ కాంట్రాక్టర్ ఎల్పుల విజయ్ ఫిర్యాదు మేరకు నస్పూర్ పోలీసులు కేసు నెం. 218/2026, u/s 331(4), 305(A) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
​ఈరోజు (సెప్టెంబర్ 03) నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు.